Nirmal Excise CI Laxman Rao: నిషేధిత మ‌త్తు ప‌దార్థాలు పట్టివేత:  నిర్మ‌ల్ ఎక్సైజ్ సీఐ ల‌క్ష్మ‌ణ్‌రావు

సిరాన్యూస్‌, ఖానాపూర్‌
నిషేధిత మ‌త్తు ప‌దార్థాలు పట్టివేత:  నిర్మ‌ల్ ఎక్సైజ్ సీఐ ల‌క్ష్మ‌ణ్‌రావు

ఓ ఇంట్లో అక్ర‌మంగా నిల్వ ఉంచిన కృత్రిమ కల్లులో కలిపే మత్తు పదార్థాలైన‌ ఆల్ఫాజోలం, క్లోరో హైడ్రైట్‌ల‌ను పోలీసు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కి త‌ర‌లించారు. ఈఘ‌ట‌న గురువారం నిర్మ‌ల్ జిల్లా ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. నిర్మ‌ల్ ఎక్సైజ్ సీఐ ల‌క్ష్మ‌ణ్‌రావు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రోహిబిషన్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ కె. కె. ప్రదీప్ రావు ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలో సోదాలు నిర్వ‌హించారు. ప‌ట్ట‌ణంలోని ధ్వారక నగర్ లో గంధం శ్రీనివాస్ ఇంట్లో సోదాలు జరుపగా 3.290కిలోలా ఆల్ఫాజోలం ల‌భ్య‌మైంది. తరువాత అతనిని విచారించగ అతనికి సంబందించిన శాంతినగర్ లోని గోదాం లో తనిఖీ చేయగా 728 కిలోల క్లోరో హైడ్రైట్ ప‌ట్టుబ‌డింది. గంధం శ్రీనివాస్ గౌడ్ ని విచారించగ క్లోర్ హైడ్రైట్ ని మహారాష్ట్ర లోని షోలాపూర్ కు చెందిన శీను బాయ్ , అల్పహోజాలం ని రాజస్థాన్ కి చెందిన రూపసింగ్ అనే వ్యక్తుల నుండి సరఫరా చేసుకుంటున్నామని తెలిపారు. ఈమేర‌కు గంధం శ్రీనివాస్ గౌడ్ ఫై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించిన‌ట్లు తెలిపారు.ఈ నిషేధిత పదార్థాల విలువ సుమారు రూ.43 లక్షలు ఉంటుందని తెలిపారు.ఈ దాడులలో ఎస్ టి ఎఫ్, టీం.బి ఎక్సైజ్ ఎస్సై బాలరాజ్, నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై లు వసంతరావు, అభిషేకర్ ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *