సిరా న్యూస్,నెల్లూరు;
అంబేద్కర్ ధర్మ పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా యజమాల ప్రసాద్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఏడిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగిలాల రామచంద్రయ్య అంబేద్కర్ సిద్ధాంతాలు అధ్యయనం ,ప్రచారంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా గత 10 సంవత్సరాలుగా ఏడిపిఎస్ జిల్లా అధ్యక్షులుగా విధులు నిర్వహించిన యజమాల ప్రసాద్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా ఏడిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎరబోతు సుబ్రహ్మణ్యం నూతనంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎంపిక కాబడిన యజమాల ప్రసాద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలం తాను జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తన వంతు బాధ్యతగా సేవలు అందించడం జరిగిందని, గడచిన కాలంలో తాను చేసిన సేవ కార్యక్రమాలు తనకు ఎంతో సంతృప్తిగా నిలిచాయని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏడిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇంగిలాల రామచంద్రయ్య ఆదేశాల మేరకు తాను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బాధితులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఏడిపిఎస్ లో తాను ఇప్పటివరకు అందించిన సేవా కార్యక్రమాలకు గుర్తుగాను తనకు జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి అవకాశం వచ్చిందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను నెరవేరుస్తూ ఏడిపిఎస్ ఆశయాలను, అంబేద్కర్ సిద్ధాంతాలను సమాజానికి చేరవేసేందుకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.