సిరా న్యూస్, జైనథ్:
ఎన్ఎంఎంఐఎస్ స్కాలర్షిప్కు ఎంపికైన గూడ విద్యార్థి
+ అభినందించిన ఉపాద్యాయులు, గ్రామస్తులు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని గూడ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్ధి డి లక్ష్మణ్ ఎన్ఎంఎంఐఎస్ స్కాలర్షిప్కు ఎంపికయ్యాడు. గ్రామానికి చెందిన చిన్నయ్య కుమారుడైనటువంటి చిన్నయ్య నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉన్న అతను గతేడాది ఎప్రిల్లో ఎన్ఎంఎంఐఎస్ పరీక్షకు హాజరు కాగా గురువారం విడుదలైన ఫలితాల్లో స్కాలర్షిప్కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాద్యాయులు గజేందర్ తెలిపారు. దీంతో ఇంటర్ మీడియట్ వరకు ప్రతీ సంవత్సరం సంవత్సరానికి రూ. 12వేల స్కాలర్షిప్కు అర్హత సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థి చిన్నయ్యను ఉపాద్యాయులు, గ్రామస్తులు అభినందించారు.