సందీప్ రెడ్డి
సిరా న్యూస్,;
ఓయూ పోలీసులు నా దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్ కి రావాలని పిలిచారు. ఎలాంటి నోటీసు లేకుండా నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని అడిగానని బాధితుడు సందీప్ రెడ్డి అన్నారు. నా భార్య ప్రెగ్నెంట్ కావడంతో హాస్పిటల్ కి వెళ్తున్నాను అని చెప్పాను.. లేదు ఇప్పుడే రావాలంటే పోలీసులు చెప్పారు. మా భార్యను ఇంట్లో దింపేసి పోలీసుల వెంబడి పోలీస్ స్టేషన్ కి వచ్చాను. పోలీస్ స్టేషన్ వచ్చాక ఓయు సిఐ చాలా అసభ్య పదజాలంతో మాట్లాడాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని అడిగినందుకు నాపై దాడి చేశారు. 15 మంది పోలీసులు కలిసి కుక్కను కొట్టినట్టు నన్ను నా తమ్ముళ్లు ఇద్దరిని కొట్టారు. ఎందుకు తీసుకొచ్చారు రీసన్ చెప్పలేదు. పోలీసులు తప్పయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు. అసలు నాపై ఎలాంటి ఫిర్యాదు రాకుండానే పోలీస్ స్టేషన్ పిలిచి కొట్టారు. నన్ను కొట్టిన పోలీసులపై అడిషనల్ డీసీపీ నరసయ్యకు ఫిర్యాదు చేశాను. వాళ్లపై చర్యలు తీసుకోకుంటే డీజీపీ వరకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని అన్నారు.