మంత్రి అంబటి
సిరా న్యూస్,గుంటూరు;
రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్ కి సవాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వృద్ధులకు రూ. 3000అందజేయటం సీఎం జగన్ యొక్క పారదర్శకతకు నిదర్శనమని ఆయన నొక్కిచెప్పారు. ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న జగనన్నను ఎవరు ఢీ కొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం వృద్ధులకుపింఛన్లు పంపిణీ చేయగా, మండల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.