విశాఖ లోనూ వైసిపి కార్యాలయానికి నోటీసు లు

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖపట్నంలోని వైకాపా కార్యాలయానికి జీవీఎంసి నోటీసులు జారీ చేసింది. ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలం లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ వీ ఎం సీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీ ఎం ఆర్ డీ ఏ కు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడం పై జీవీఎంసి వివిరణ కోరింది. వారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *