ఇప్పుడుంది అసలు ఆట కేటీఆర్

సిరా న్యూస్,హైదరాబాద్;
బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు బుధవారం మీడియా తో మాట్లాడారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చజరగలేదు. ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నామని అన్నారు.
ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా ? మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామని అన్నారు. రేపు గవర్నర్ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు. ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు. ఎలా ఇస్తారుఅంటే ఇస్తామని చెప్తున్నాడు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి. ఇప్పుడు ఉంది అసలు ఆట. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండురోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది ? మొదటి మంత్రి వర్గం లోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *