సిరా న్యూస్;
ఆంధ్ర ప్రదేశ్ లో బాలింతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని మళ్లీప్రారంభించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్సులు, సాధారణ అంబులెన్సుల మధ్య అనుసంధానం పెంచాలన్నారు. డోలీతో గర్భిణులు, బాలింతలను మోసుకొస్తున్న దృశ్యాలు కనిపించ కూడదని స్పష్టం చేశారు. కాగా బేబీ కిట్లో చిన్న పరుపు, శానిటైజర్, సోప్, పౌడర్, దోమతెర, న్యాప్కిన్ లు ఉంటాయి.