సిరాన్యూస్,ఆదిలాబాద్
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
* పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు నూర్‌సింగ్
* కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల, ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు నూర్‌సింగ్ అన్నారు. సోమవారం కలెక్టర్‌కు పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా లోక సభ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఎన్నికల సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, వ్యాధిగ్రస్తులైన ఉద్యోగులకు విధుల్లో మినహాయింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోషియేట్ అధ్యక్షులు శ్యామల రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి బాబన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ర నవీన్ యాదవ్, జిల్లా కోషాధికారి మూజీబ్, జిల్లా మీడియా ఇంచార్జ్ సంతోష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సునిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.