సిరా న్యూస్, ఓదెల
ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా నూతి సత్యనారాయణ
* విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
* విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు నాగవేల్లి ఈశ్వర్
పెద్దపల్లి జిల్లా ఓదెల శుక్రవారం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవల్లి ఈశ్వర్, శ్రీమన్నారాయణ, నూతి శంకర్, బ్రా హ్మాండ్ల పల్లి రవీంద్ర చారి ఆధ్వర్యంలో ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షునిగా నూతి సత్యనారాయణ, ఉపాధ్యక్షునిగా నాగుల మల్యాల రమేష్ చారి, ప్రధాన కార్యదర్శిగా తాటికొండ వెంకటేశ్వర్లు, కోశాధికారిగా నాగుల మల్యాల లక్ష్మణ చారిలను ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. సంఘానికి సలహాదారులుగా పోలోజు రమేష్, బ్రాహ్మడ్ల పల్లి భీమయ్య నియమించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘానికి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు అందిస్తున్నాని అన్నారు. అధ్యక్షున్ని సంఘ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఓదెల మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగవేల్లి ఈశ్వర్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులు ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డారని, మార్కెట్లో రెడీమేడ్ వస్తువులు రావడంతో విశ్వబ్రాహ్మణులకు చేతినిండా పని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు నిండిన ప్రతి విశ్వబ్రాహ్మణునికి పెన్షన్ మంజూరు చేయాలని అలాగే సబ్సిడీ కింద పనిముట్లు అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే ను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బి సత్యనారాయణ, నాగవెల్లి సంతోష్ ఎన్ శ్రీనివాస్, రమణాచారి, శ్రీరాముల శ్రీనివాస్ , ప్రతాప్, రఘుపతి, మల్లయ్య , రాకేష్, రాజు, బాలకృష్ణ, నూతి కృష్ణ, రమేష్. ఏ ర్రో జు నారాయణ. మహేందర్. ఈశ్వర్ , వెంకటస్వామి, తాటికొండ శంకరయ్య. రామయ్య. దశరథం తదితరులు పాల్గొన్నారు.