సిరాన్యూస్,ఓదెల
ఎస్సై అశోక్ రెడ్డిని సన్మానించిన విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతి సత్యనారాయణ
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం పొత్కపల్లి ఎస్సై అశోక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఓదెల గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నూతి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నాగల మల్యాల రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి తాడికొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగుల మల్యాల లక్ష్మణాచారి, నాగవె ల్లి శ్రీమన్నారాయణ, సలహాదారులు బ్రాహ్మండ్లపల్లి భీమయ్య, సభ్యులు నాగవె ల్లి శ్రీనివాస్, నూతి ప్రతాప్, రాజేందర్, తదితరులు ఉన్నారు.