సిరా న్యూస్,హిందూపురం;
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో మునిసిపల్ కార్మికుల సమ్మె ఎనిమిదవ రోజుకు చేరింది. 38 వార్డులలో ప్రైవేటు కూలీలను పారిశుధ్య పనులు చేయించేందుకు వెళ్లిన కమిషనర్ను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. వాహనాలలోకి వేసిన చెత్తచెత్తరాన్ని రోడ్డుపై పారపోశారు. మున్సిపల్ పరిధిలో 400 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఎనిమిది రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రైవేటు కూలీలతో వాహనాలు తీసుకెళ్లి పారిశుద్ధ్య పనులు చేస్తుండగా ఒక్కసారిగా మున్సిపల్ కార్మికులు అడ్డుకొని మా సమస్య పరిష్కరించే వరకు మేము ఎక్కడా పారిశుద్ధ్య పనులు చేయించమని అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ కమిషనర్, పారిశుద్ధ్య కార్మికుల మధ్య వాగ్వివాదం జరిగింది. మాట తప్పిన జగన్ దిగిపోవాలంటూ కార్మికులు నినాదాలు చేశారు. సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు ఎలాంటి పనులు చేయించమని మున్సిపల్ కార్మికులు తేల్చిచెప్పారు.