సిర్యానూస్, ఓదెల
ఓదెలలో మళ్ళీ ప్రజా పాలన దరఖాస్తు అందజేత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలోని ప్రజా పాలన దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ రావటం లేదని మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారుల దరఖాస్తు చేసుకుంటున్నారు. గృహ జ్యోతి లబ్ధిదారులు ఓదెల గ్రామానికి చెందిన క్యాతం సదానందం మాట్లాడుతూ జనవరి లో ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ గృహ జ్యోతి, జీరో కరెంట్ బిల్లు అమలు కాలేదని మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్నానని తెలిపారు.