సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఓదెలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పోలోజు రమేష్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని పేర్కొన్నారు .అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు వేలిసోజ్ రవీంద్ర చారి, బ్రాహ్మండ్లపల్లి రమణాచారి, నూతి ప్రతాప్, వేలి సోజు శ్రీనివాస చారి, సదానంద చారి, శ్రీధర్ చారి, దేవరకొండ సతీష్ , నూతి శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.