సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ముదిరాజుల పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని బుధవారం ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజుల సంఘం అధ్యక్షులు మంద కొమురయ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డప్పు సప్పుల తో ఇంటింటికి తిరిగి బోనం ఎత్తుకొని పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు . మహిళలు బోనాలతో పెద్దమ్మ తల్లి గుడి వద్దకు చేరుకొని ఘనంగా పూజలు నిర్వహించారు.ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఓదెల గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఎంపీటీసీ బోడకుంట లక్ష్మి, చిన్నస్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓదెల గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మంద కొమురయ్య, ఉపాధ్యక్షులు పెండం రాములు, కార్యదర్శి తూ డి సురేష్, డైరెక్టర్లు పిట్టల రవీందర్, తూడి రాజయ్య, ప్రవీణ్, పెండం ఓదెలు, మంద కృష్ణమూర్తి, పసిడ్ల స్వామి, కుల బాంధవులు మాజీ వార్డు మెంబర్ పిట్టల నరసింగం, రామచంద్రం, సుధాకర్, పెండం స్వామి, పోషవేనా ఇజిగిరి, తదితరులు పాల్గొన్నారు.