Odela: ఓదెలలో పౌర హక్కుల దినోత్సవం

సిరా న్యూస్,ఓదెల
ఓదెలలో పౌర హక్కుల దినోత్సవం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ని దళిత కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదెల దళిత కాలనీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో త‌హ‌సీల్దార్ యాకన్న మాట్లాడుతూ జాతి, కులం, మతం వివక్షత లేకుండా అందరూ సమానులే అనే ఆలోచన కలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తిరుపతి, ఎంపీఓ భాస్కర్, ఏఎస్ఐ సుధాకర్, గ్రామ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, దళిత కాలనీ స్కూల్ టీచర్ లక్ష్మి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *