సిరాన్యూస్, ఓదెల
ఘనంగా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో బుధవారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగు రహిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మ చారి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ సంచులు వద్దు -గుడ్డ సంచులు ముద్దు అంటూ , పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు చేతులమీదుగా గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సదాశయ ఫౌండేషన్ నేత్ర అవయవ శరీర దానాలపై కృషి చేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకై గుడ్డ సంచులను పంపిణీ చేయడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్,మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, మాజీఉప సర్పంచ్ గోలి లింగారెడ్డి ఓదెల మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, డాక్టర్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు క్యాతo. మల్లేశం,జీడి.నవీన్ బైరి వినోద్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి. భీమనపల్లి పృధ్వీరాజ్ మేర్గు. సారంగo.కేఎస్ వాసు అభినందించారు