సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో బాంబు స్క్వాడ్ తనిఖీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ ఆదేశాల మేరకు సోమవారం బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మండలంలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలలో నెలవారి తనిఖీలలో భాగంగా బాంబు స్క్వాడ్ బ్రిడ్జిలను, రహదారులను, కల్వర్టులను తనిఖీ చేశారు. కార్యక్రమం లో ఎస్సై జి. అశోక్ రెడ్డి, కానిస్టేబుల్ లో తదితరులు పాల్గొన్నారు.