సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో జోరందుకున్న వరి నాట్లు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం భీమర పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వ ర్షాలతో రైతులు వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. ఇప్పటికే వరి నారు మళ్లు చేతికి రావడంతో రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు. పలు గ్రామాల్లో మహిళలు వరి నాట్లు వేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాలలో నాట్లు వేసే మహిళా కూలీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వారం రోజుల ముందు డబ్బులు ఇస్తే తప్ప నాట్లు వేసే మహిళా కూలీలు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.