సిరాన్యూస్, ఓదెల
చెత్త ఇక్కడ… డంపింగ్ యార్డ్ ఎక్కడ..!
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ దగ్గర్లో ఉన్న బతుకమ్మ ఆడే స్థలంలో దుర్గంధం వెదజల్లే చెత్తతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్తను చూసి ప్రజలు ఇదా.. ప్రజా పాలన అంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కడ చూసినా చెత్త కనబడుతుంది. సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా నాటుదాం ఒక చెట్టు అమ్మ పేరు మీద కార్యక్రమం ప్రక్కన ఈ దృశ్యం కనబడింది. అధికారులు ఈ చెత్తను తొలగించి స్వచ్ఛత వైపు అడుగు వేయాలని ప్రజలు కోరుతున్నారు.