సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ప్రారంభమైన ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మ సంబరాలు పితృ అమావాస్యనాడు ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగుతాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులపాటు మహిళలు ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడి, అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించి, అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. బుధవారం మండల ఆఫీస్ దగ్గర ఉన్న ఆర్టిజన్ కాలనీలో సాంప్రదాయ దుస్తులతో మహిళలు గునుగు పూలు బంతిపూలు చామంతి పూలు తో అందంగా పేర్చిన బంగారు బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ పాటలతో పాడుతూ ఆడారు.