సిరాన్యూస్, ఓదెల
ఓదెల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా యూనియన్ అధ్యక్షులు తూడి శంకర్ మాట్లాడుతూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర ఉన్న పోచమ్మ గుడి లో బోనాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరుకున్నామని తెలిపారు. యూనియన్ లో 30 మంది ఉన్న యూనియన్ సభ్యులందరూ కలిసికట్టుగా ఉంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పసిడ్ల స్వామి, మంద రామకృష్ణ, పిట్టల రమాకాంత్, పసిడ్ల సతీష్ తూడి కుమార్, పరశురాం , ఎస్ కుమార్ , శాతాల కుమార్, తదితరులు ఉన్నారు.