సిరాన్యూస్, ఓదెల
రోడ్డపై వరి నాట్లు వేసి బీఆర్ఎస్ నాయకుల నిరసన
చిన్నపాటి వర్షానికే రోడ్డు బురదమయంగా మారడంతో అందులో నాటు వేసి బీఆర్ఎస్ నాయకుల నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో వ్యవసాయ భూములకు వెళ్లే రోడ్లకు ఇటీవల పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు రోడ్డు మరమ్మతుల కోసం ఐదు లక్షలు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ రోడ్లపై కనీసం బైకు వెళ్లే పరిస్థితి లేదు. పూర్తిగా బురదమయం కావడంతో జారిపడి కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఈ పనిని నిరసిస్తూ గూడెం బి ఆర్ ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రోడ్లపై వరి నాట్లు వేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస్, మాజీ గ్రామ సర్పంచ్ ఉష్క మల్ల చంద్రమౌళి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రేగుల సంపత్, కుల కాని సతీష్, తిప్పారపు రాజేందర్, రఘుపతి, బెదిగం ముని, బుడిగె కుమారస్వామి, ఇటికాల ప్రవీణ్, కటుకూరి రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.