సిరాన్యూస్, ఓదెల
భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న
పెద్దపల్లి జిల్లాలో అతి ముఖ్యమైన దేవాలయం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ప్రతి ఆది, బుధవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుని వెళుతుంటారు. బుధవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గుడి ముందర పట్నం వేసి బోనాలు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చలువ పందిళ్లు ,మంచినీళ్లు సౌకర్యం కల్పించారు.