సిరాన్యూస్, ఓదెల
ఓదెల రైల్వే స్టేషన్ లో తిరుపతి రైలు ఆపాలి
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండల కేంద్రము లోని శ్రీ మల్లికార్జున స్వామి వారి జాతర, ఉగాది పండుగ నుండి మొదలుకొని మూడు నెలల పాటు జరిగే జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్ నుండి వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తుంటారు. ఓదెల మండలం ఏర్పడి నాప్పటి నుండి మండలంలోని మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. పోత్కాపల్లి, కొలనూరు, ఓదెల స్టేషన్ల నుండి వారి వారి పనులపై ప్రయాణికులు నిత్యం రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. తిరుపతి నుండి కరీంనగర్ కు వెళ్లే తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఓదెల రైల్వే స్టేషన్ లో ఆపాలని పలుమార్లు ఎంతోమంది రైల్వే జీఎం ను కలిసి వినతి పత్రం అందజేశారు. కానీ రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకొని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసమైనా తిరుపతి రైలు ఓదెల రైల్వే స్టేషన్ లో ఆల్టింగ్ ఇవ్వాలి. వచ్చి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రైల్వే అధికారులను భక్తులు, ప్రయాణికులు కోరుతున్నారు.