సిరా న్యూస్,అవనిగడ్డ;
మిచాంగ్ తుఫాన్ మచిలీపట్నం వైపు దూసుకు వస్తుండటంతో అవనిగడ్డలో అధికారులు అప్రమత్తమైయారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను రావటంతో రైతులు తీవ్ర ఆందోళనలో వున్నారు. కోసిన దాన్యం మొత్తాన్ని రైస్ మిల్లులకు చేరవేయాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు అందరినీ వెనక్కు పిలిపించి వారిని అప్రమత్తం చేసారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసారు. తుఫాను దృష్ట్యా పాఠశాలలకు, కాలేజీలకు జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి ఎన్డీఆర్ఎష్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.
========================