సిరా న్యూస్,రంగారెడ్డి;
ఆదిబాట్ల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు,నిబ్బందనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు,ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేస్తామన్నారు,ప్రభుత్వ అనుమతుల మేరకే నిర్మాణాలు చేపట్టాలని తెలియజేశారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్ పల్లి ,కొంగర కలాన్ లో కూడా అక్రమ కట్టడాలు షెడ్లు అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి వాటిని కూడా కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నామన్నారు ఆదిబట్ల టి సి ఎస్ ముందు ఉన్న దాదాపు 10 అక్రమ బిల్డింగ్ కట్టడాలు ఏకంగా 5 అంతస్తులు నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతూ నిర్మాణాలు చేపడుతూన్నా వారిని ఉపేక్షించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.
======================