సిరా న్యూస్,హైదరాబాద్;
మర్రి చెన్నారెడ్డి ఆడిటోరియంలో లో కొత్తగా నియమితులైన 144 మంది వ్యవసాయ అధికారుల శిక్షణా కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని వారికి దిశా నిర్దేశం చేసారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు చేరవేసే ప్రధాన బాధ్యత మీదే. వ్యవసాయ రంగంలో తెలంగాణా రాష్ట్రాన్ని దేశం లొనే అగ్రగామి గా నిలబెట్టాలన్న ప్రభుత్వ సంకల్పం లో మీరందరు భాగస్వాములు కావాలి. రైతులను సంప్రదాయ వ్యవసాయం నుండి మళ్లించి అధికాదాయం వచ్చే పంటల సాగు వైపు మళ్లించాలని అయన అన్నారు.