చిగురుమామిడి, సిరా న్యూస్
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి పరిశీలించారు. ఆయిల్ పామ్ మొక్కల కోసం చేపడుతున్న పనులను గురించి అడిగి తెలుసుకున్నారు. బొమ్మనపల్లి గ్రామంలో మామిడి తోటలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.