గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కరపత్రాలు ఆవిష్కరణ..
ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కే శ్రీనివాసులు
సిరా న్యూస్,బద్వేలు;
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్ నిర్వహించాలని పరిశ్రమల అన్నిటిలో కార్మిక సమ్మె జరపాలని నిర్ణయించాయి. అన్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు అసోసియేషన్లు ఫెడరేషన్లు వినియోగదారుల సంఘాలు ప్రతి సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి యువజన మహిళ సాంస్కృతిక సంఘాలు గ్రామీణ బంద్ ను పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కే శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
శుక్రవారం స్థానిక సుందరయ్య భవనం నందు ఉదయం 11 గంటలకు గ్రామీణ బంద్ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ కే శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా మోసగిస్తుందన్నారు. వ్యవసాయం పరిశ్రమలు గనులు విద్యుత్ అడవి సంపదలను రవాణా బ్యాంకు లు ఎల్ఐసి తదితర సంస్థలన్నిటిని ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించి నాలుగు కార్మిక కోడ్లను తెచ్చింది. రైతాంగ ఉద్యమానికి తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేసి మరొక రూపంలో వాటిని అమలు పరుస్తుంది విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందు పెట్టింది. కార్పెట్ కంపెనీలకు రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్య ప్రజల నిత్వసర వస్తువులన్నింటిపైన జీఎస్టీ పేరుతో పన్నులు పెంచింది గత 10 సంవత్సరాలలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆదాని అంబానీలు ప్రపంచ కుబేరులుగా జాబితాలో చేరారు అన్నారు. పేద రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు 1,50,000 మంది చనిపోయారన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి మరింత ద్రోహం చేసింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించింది వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడం లేదు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వసితుల నష్టపరిహారం పురావాస0 తనకు సంబంధం లేదంటుంది. రైల్వే జోన్ విగనామం పెట్టింది కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఇవ్వకపోగా తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. రాజధాని నిర్మాణానికి పట్టిన మట్టితో సరిపెట్టింది. కృష్ణా జలాలు పంపిణీలో రాష్ట్రానికి ద్రోహం తలపెట్టింది. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని. పట్టణ కార్యదర్శి జి నాగార్జున. బద్వేల్ రూరల్ అధ్యక్ష కార్యదర్శులు ఓబుల్ రెడ్డి. బాల గురవయ్య. ముస్తఫా. సిఐటియు నాయకులు పీసీ కొండయ్య. రాజగోపాల్. బ్రహ్మయ్య .బాబయ్య. గంప సుబ్బరాయుడు. నాయకురాల్లో అనంతమ్మ. మోక్షమ్మ. గౌతమి. బాలమ్మ. నాగమ్మ. మస్తాన్ .బి కైరున్ బి. హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు