సిరా న్యూస్,భూపాలపల్లి;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక పనులు పున ప్రారంభమయ్యాయి. ఏడవ బ్లాకు లో 11 గేట్లు ఉండగా అందులో ఎనిమిది గేట్లు స్ట్రక్ అయి ఉన్నాయి. గురువారం రోజు అందులో నుండి ఒక గేటును ఎత్తడం జరిగింది. మరొక గేటును బుధవారం ఎత్తి యోజనలో అధికారులు ఉన్నారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు పనులను చేపడుతున్నారు. గేట్ల కింది భాగం పైభాగం లో పేరుకుపోయిన ఇసుకమేటలను , మట్టిని తొలగిస్తున్నారు. పిల్లర్ల లిఫ్ట్ కింది భాగంలో ఏర్పడిన రంధ్రాల్లో కాంక్రీట్ సిమెంట్‌తో గ్రౌండ్ పనులు చేపడుతున్నారు. వర్షాలు పడకుండా ఉంటే ఫిట్ పెల్స్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తానికి అయితే మేడిగడ్డ బ్యారేజీ లో నీరు ఆగకుండా ఉండేందుకు గేట్లు మొత్తం లేపే ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు అన్నారం బ్యారేజీ గేట్ల సమీపంలో ఉన్న ఇసుకను టెండర్ల ప్రక్రియ రూపకంగా ఆరు లక్షల 50 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను టెండర్ల ప్రక్రియ ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు.
==================