సిరా న్యూస్, చొప్పదండి:
ఒపా నూతన కార్యవర్గం ఎన్నిక
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజక వర్గం ఒపా (విశ్వబ్రహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్) నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. ఆదివారం చొప్పదండి పట్టణంలో నిర్వహించిన ఎన్నికలకు రాష్ట్ర కన్వీనర్ వేములవాడ ద్రోణాచారి, జిల్లా అధ్యక్షులు కట్ట విష్ణువర్ధన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పేద విశ్వబ్రహ్మణ కుటుంబాలను అదుకోవడానికి సంఘం ఎల్లప్పుడు ముందు వరుసలోఉంటుందన్నారు. వివిద సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడంలో చొప్పదండి ఒపా ముందంజలో ఉందని అన్నారు. సంఘం నియోజక వర్గ అధ్యక్షులుగా పెద్దపల్లి లక్ష్మణా చారి, గౌరవ అధ్యక్షులుగా గాలిపల్లి బ్రహ్మానందం, ముఖ్య సలహాదారుగా చామన్‌పల్లి శంకర్ స్వామి, ప్రధాన కార్యదర్శిగా ముమ్మడి హరికృష్ణ, ఆర్థిక కార్యదర్శిగా గొల్కోండ శ్రీనివాస్, ఉపాద్యాక్షులుగా తిప్పర్తి శ్రీనివాస్, గాలిపల్లి రమేష్, చిలకనూరి మహేష్, సహాయ కార్యదర్శులుగా కోటగిరి శ్రీనివాస్, నర్సింగోజు ఆంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా గోవులకొండ అనిల్, కార్యవర్గ సభ్యులుగా మాధవ చారి, శ్రీనివాస్, లక్ష్మీరాజం, బ్రహ్మానందం, నరేష్, తదితరులను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. నూతన కార్యవర్గ సభ్యులు సంఘం బలోపేతం కోసం కృషీ చేయాలని కోరారు.