– చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
-పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన సిపి శ్రీనివాస్
సిరా న్యూస్,పెద్దపల్లి;
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ పేరుతో డ్రోన్ నిఘా ప్రారంభించనున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ, సర్కిల్, స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆయన సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి రికార్డులను, సిసి కెమెరాల పనితీరు ను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు పై, జిల్లా కేంద్రంతోపాటు గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా సహకరించాలన్నా రు. అలాగే బ్లూకోట్స్ టీమ్‌లు 24 గంటలపాటు పని చేస్తాయన్నారు. పెట్రోలింగ్ ముమ్మరం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
*పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ….
అసాంఘీక శక్తుల నిర్మూలనకు పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడ మొదలు పెడతామని సీపీ తెలిపారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లో అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఆపరేషన్ గరుడ పేరిట డ్రోన్‌లతో పెట్రోలింగ్ నిర్వహించి ప్రత్యేక నిఘా ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లిలో విజయవంతమైతే కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి రమేష్, సీఐ కృష్ణ, ఎస్‌ఐ లు లక్ష్మణ్‌రావు, మల్లేష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.