సిరా న్యూస్, ఆదిలాబాద్:
సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలి
– సీఎంకు బహిరంగ లేఖ రాసిన పడాల రవీందర్
గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు న్యాయం చేయాలని సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. ఎన్నికల టైంలో హనుమకొండ వేధికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. టీ తాగే టైంలో మీ సమస్యను పరిష్కరిస్తామని, ఉద్యోగులను సెక్రెటెరియెట్‌లో కూర్చోబెట్టి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 12న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల గురించి చర్చించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.