సిరాన్యూస్, తాంసి
సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలి : సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్
* చనిపోయిన సమగ్ర శిక్షా ఉద్యోగులకు నివాళులు
సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరణ చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధికార ప్రతినిధి పడాల రవీందర్ మాధవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల వనరుల కేంద్రం లో మరణించిన తోటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నివాళులు అర్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. చనిపోయిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ ప్రకటిస్తామని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అమలుచేయడం లేదని తెలిపారు. కార్యక్రమంలో నాయిని.పార్థసారథి,జానకొండ స్వామి,పసి రాకేష్, ఒద్ది భోజన్న, కన్నక్ గణేష్, నిమ్మల రాజేశ్వర్, తొగరి సురేందర్, రాగి సంజీవ్, మాడ ప్రభావతి పాల్గొన్నారు.