సిరాన్యూస్, ఆదిలాబాద్
సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పడాల రవీందర్ మాధవ్
సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్దీకరించాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘ -రాష్ట్ర అధికార ప్రతినిధి , సీఆర్‌పీఏటీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పడాల రవీందర్ మాధవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ సమగ్ర శిక్షా లో గత 20 సంవత్సరాలనుండి దాదాపు 22 వేల ఉద్యోగులు చాలిచాలని వేతనాలతో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిపిట్ ఇవ్వకుండా 61 సంవత్సరం లు నిండిన ఉద్యోగులను వెంటనే విధుల నుండి తెలగించాలని ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు.ఈ ఆదేశాలను పూర్తి గా వ్యతిరేకస్తున్నామని, ఈ ఆదేశాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.61 ఒక్క సంవత్సరాలు నిండిన రిటైర్డ్ సమగ్ర శిక్షా ఉద్యోగులకు రూ. 1000000 బెనిపిట్స్ క్రింద ఇవ్వాలని తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు సమగ్ర శిక్షా ఉద్యోగులు అందరిని వెంటనే క్రమంబద్దికరణ చేయాలని తెలిపారు.