సిరాన్యూస్, ఆదిలాబాద్
ఈనెల 28న జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాః రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు పడాల రవీందర్ మాదవ్
తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 28న మహా ర్యాలీ, ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు పడాల రవీందర్ మాదవ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ భవనంలో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉమ్మడి కార్యాచరణ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 27న మండల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమావేశం, కేజీబీవీ, యూఆర్ఎస్‌ల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు 100శాతం సామూహిక సెలవు ప్రకటించామన్నారు. కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగులు అత్యవసర విభాగాలు తప్ప మిగితా అందరు సామూహిక సెలవు పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రకాష్, వెంకటి, దేవదర్శన్, శ్రీకాంత్, నరేష్, సోమన్న, రమేష్, నాగనాథ్, మితున్, అతుల్, వినోద్, ప్రదీప్, జావీద్, భాను, శంకర్, తదితరులు పాల్గొన్నారు.