రైతులకు తప్పని పడిగాపులు

సిరా న్యూస్,మహబూబ్ నగర్;
ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతకు ధాన్యం అమ్ముకోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ప్రకటనటకు క్షేత్రస్థాయి పరిస్థితులకు అస్సలు పొంతన లేకుండా ఉంది. కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ ధాన్యాన్ని కొనుగులు చేయడం లేదు. దీంతో రోజుల తరబడి ధాన్యం రాశులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మిల్లులు కేటాయించకపోవడమే ప్రధాన సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వానాకాలంలో రైతులు పెద్ద ఎత్తున వరిపంట సాగుచేశారు. అదే స్థాయిలో రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం సన్నాహకలు చేస్తోంది. ఈసారి మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ప్రభుత్వానికి అమ్మాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడం, చేసిన ప్రాంతాల్లో కొనుగోళ్లు జరపకపోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను అదునుగా భావించిన వ్యాపారులు గద్దల్లా చేలల్లో వాలిపోతున్నారు. కోతలు జరుగుతుండగానే రైతులతో బేరాలు ఆడుతున్నారు. వరి ధాన్యం పచ్చిగా ఉండగానే మద్దతు ధరకు దిగువకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా మోసపోతున్నారు. తక్షణమే నగదు, తేమ శాతం లెక్కలు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సైతం ఆ కష్టాలు అన్ని తప్పుతాయని ఎంతకో కొంతకు అంటూ వారికే అమ్మేస్తున్నారు.ఇక ప్రభుత్వ కోనుగులు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామనుకున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. ఆలస్యంగా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పటివరకు కొనుగోళ్లు జరపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ధాన్యాన్ని ఎండబెట్టి ఎదురుచూస్తున్నమని అన్నదాతలు చెబుతున్నారు. కల్లాలు లేక ధాన్యాన్ని అరబోసేందుకు అన్నదాతలకు స్థలం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఎండిన ధాన్యాన్ని త్వరగా కొంటే మిగిలిన రైతులకు లబ్ధి చేకూర్చేలా ఉంటుదని అన్నదాతలు తెలిపారు. ఇక ఇప్పటికే రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసుకుని కాపలా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే బోనస్ పట్ల కోదంరికి అపోహలు కనిపిస్తున్నాయి. మద్దతు ధర, బోనస్ ఒకేసారి ఇస్తారా లేక రెండు వేర్వేరుగా ఇస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండిటినీ కలిపి ఒకేసారి ఇస్తే బాగుంటుందని… అలా అయితే రైతులు కొంత ఓపిగ్గా అయిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోకే ధ్యానం తీసుకువస్తారని చెబుతున్నారు. అంతా సరిగ్గా ఉంటే వ్యాపారులు, దళారులను నమ్మాల్సిన పరిస్థితి ఉండదంటున్నారు.ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధ్యానం కొనకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ధ్యానం తూకం వేయగానే అక్కడి నుండి లిఫ్ట్ చేసి మిల్లులకు తరలించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం మిల్లులు కేటాయించలేదని తెలుస్తోంది. బ్యాంకు గ్యారంటీల విషయంలో మిల్లర్లు, ప్రభుత్వానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి. అందుకే కొనుగోళ్ల అంశంలో జాప్యం జరుగుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో రోజురోజుకి కోనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతుండగా… వ్యాపారులు రెచ్చిపోతున్నారు. చేతికందిన పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అర్భాటంగా ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *