సిరాన్యూస్, ఓదెల
పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా సహాయ కార్యదర్శిగా తాటికొండ రామచంద్రం నేత
పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శిగా తాటికొండ రామచంద్రం నేత ఎన్నికయ్యారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీ నగర్ లో పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు రుద్ర పాండురంగ శాస్త్రి, జిల్లా అధ్యక్షులు భీముని రవీందర్ ఆధ్వర్యంలో ఓదెల మండల కేంద్రానికి చెందిన తాటికొండ రామచంద్రం నేతను పద్మ బ్రాహ్మణ పురోహిత సంఘం సహాయ కార్యదర్శిగా నియమించారు. ఈసందర్బంగా తాటికొండ రామచంద్రం నేతతో ప్రమాణ స్వీకారం చేయించి నియామక పత్రం అందించారు. అనంతరం తాడికొండ రామచంద్రం నేత మాట్లాడుతూ నాకు ఇచ్చిన పదవి బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహిస్తానని, జిల్లా, రాష్ట్ర యొక్క మార్గదర్శకాలను పాటిస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని పద్మశాలి కుల బాంధవులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తాడికొండ రామచంద్రంనేత కు ఓదెల పద్మశాలి సంఘం నాయకులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లునేత . మెరుగు భీష్మ చారి నేత. చీకట్ల మొండయ్య నేత అభినందనలు తెలిపారు.