సిరా న్యూస్, జైనథ్
విద్యార్థులు కష్టపడి చదివి మంచి గ్రేడ్ సాధించాలి
* పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ
* కాల్స ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్యాడ్ల పంపిణీ
విద్యార్థులు కష్టపడి చదవి మంచి గ్రేట్ సాధించాలని గిమ్మ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ అన్నారు. గణిత మేధావి ఎస్ సి ఆర్ టి పాఠ్య పుస్తక రచయిత, దివంగత గణిత ఉపాధ్యాయుడు ధర్మేందర్ సింగ్ గుర్తుగా కాల్స ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆదిలాబాద్ జిల్లా గిమ్మ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్ల పంపిణీ చేశారు. ఈరోజు జరిగిన 10 వ తరగతి వీడ్కోలు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి గ్రేట్ సాధించాలని కోరారు. కష్టపడనిది విజయ శిఖరాలు అధిరోహించలేమని విద్యార్థులకు సందేశం ఇవ్వడం జరిగింది .సమావేశంలో ఉపాధ్యాయులు పద్మ ప్రమోద్ కుమార్ , సంతోష్ కుమార్ , గోమంత్ శ్రీనివాస్ గౌడ్ , రోహిదాస్, గీతేష్ , వినోద్, మనోహర్ , శ్రీనివాస వర్మ, అరుణ పదవ తరగతి తొమ్మిది తరగతి విద్యార్థులు పాల్గొన్నారు