సిరా న్యూస్, చొప్పదండి
ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనముగా పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం చొప్పదండిలోని నేతన్న విగ్రహం దగ్గర చొప్పదండి పద్మశాలి కుల సంఘం అధ్యక్షుడు దండే రాజయ్య , అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో చొప్పదండి మండల అధ్యక్షులు మచ్చ రమేష్ ,చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దండే రమాదేవి,మండల గౌరవ అధ్యక్షులు గాజంగి రాములు, పట్టణ చేనేత సహకార సంఘం అధ్యక్షులు అనుమల్ల పద్మశాలి కుల సంఘం ఉపాధ్యక్షులు వల్లాల నాగేష్, ఎన్నం మునీందర్,పట్టణ కోశాధికారి దండే లింగన్న, మారంపెళ్లి నాగభూషణం, జక్కని మల్లేశం, మంచికట్ల విఠల్ ,కళ్యాణపు శ్రీనివాస్, దూస కైలాసం, చేట్టిపెళ్లి శ్రీనివాస్, ఎలిగేటి శ్రీనివాస్,పెంటి భూమయ్య, డోలక్ రాజు పాల్గొన్నారు.