సిరా న్యూస్, కుందుర్పి
రథోత్సవం కోసం ఆర్థిక సహాయం
* ఎరుకుల పద్మావతమ్మ తిమ్మప్ప
కంబదూరు మండల కేంద్రంలో వెలసిన అతి ప్రాచీన దేవాలయమైన కమల మల్లేశ్వర స్వామి ఆలయ రథోత్సవం కోసం కంబదూరు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచి ఎరుకుల పద్మావతమ్మ తిమ్మప్ప లక్షా నూటపదహారు రూపాయలను నగదు రూపంలో ఆలయ ధర్మకర్త వెంకటేశులుకు మల్లేశ్వర స్వామి సన్నిధిలో శనివారం అందజేశారు. అంతేకాకుండా ఆలయ అభివృద్ధి కి తనవంతు శక్తి వంచన లేకుండా సహకారం అందిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు ఆమె హామీనిచ్చారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ,స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయకమిటీ సభ్యులు స్వామివారిని వేడుకున్నారు. కార్యక్రమంలో సచివాలయ గృహాసారథుల మండలాధ్యక్షుడు గంగాధర,నీలి శంకరప్ప,మీ సేవ కుమార్ ఉన్నారు.