సిరాన్యూస్,చిగురుమామిడి
రైతాంగ సమస్యలు పరిష్కరించాలి :బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఇప్ప నరేందర్ కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు,ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, 500 బోనస్,రైతు రుణమాఫీ ఇతర రైతు సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు.ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కంది శంకర్, బీజేవైఎం హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ జేరిపోతుల శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు అచ్చ రవీందర్, బీజేపీ నాయకులు జంగా శ్రీనివాస్ రెడ్డి, గాండ్రోత్ రామన్న, గంధే చిరంజీవి, నిమ్మ రమాకాంత్, ఆరేళ్ల శ్రీనివాస్, శ్యామకూర చేంద్ర శేఖర్, నరేందర్ రెడ్డి, అనిల్, సాయి తదితరులు పాల్గొన్నారు.