సిరాన్యూస్, భీమదేవరపల్లి
రైతులకు రుణమాఫీ ప్రకటించాలి: బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. సోమవారం భీమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్టం లో అబద్దాల మంత్రి పొన్నం ప్రభాకర్ ఏక్ నెంబర్ అని ఆరోపించారు. హుస్నాబాద్ నియోజకవర్గం వేదిక గా ఎన్నోసార్లు రైతులను ఆదుకునేది మా ప్రభుత్వం అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని, కానీ ఇంత వరకు రుణ మాఫీ చేయలేదన్నారు. రైతు బంధు కౌలు రైతులకు ఇస్తా అన్నా మాట ఏటుపోయిందని ప్రశ్నించారు. బీమదేవరపల్లి మండలం లో ఒక ప్రభుత్వ హాస్పటల్ మంత్రి హోదాలో కట్టించండా అని ప్రశ్నించారు.ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో మండల ప్రధానకార్యదర్శి గుండెల్లి సదానందం, గోదాల సంపత్, శ్రీరామోజు శ్రీనివాస్, బండారి కర్ణాకర్, అయిత సాయి, సదానందం గౌడ్, దొంగల వేణు, దొంగల రాణా, బొజ్జపురి పృథ్వీరాజ్, గద్ద రాజేందర్, ముద్దసాని వీరన్న, సోప్పరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.