సిరా న్యూస్, భీమదేవరపల్లి
దమ్ముంటే బండి సంజయ్ పై ఎంపీగా పోటీ చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులపై ముసలి కన్నీరు
* బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
పొన్నం ప్రభాకర్ మంత్రిగా రాజీనామా చేసి ఎంపీ బండి సంజయ్ పై పోటీ చేయాలని బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ అన్నారు. భీమదేవరపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి ప్రతిసారి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్టంలో రైతంగాన్ని ఆగం చేస్తుందని ఆరోపించారు. లక్షల రుణమాఫీ ఏటుపోయిందని, 500 బోనస్ ఎప్పుడు ప్రకటిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ అంటే తెలుసా పొన్నం ప్రభాకర్ అని ప్రశ్నించారు. తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు కనీసం ఒక పల్లి విత్తనం, టమోటో , బబ్బేర, మినుములు. విత్తనాలు ఇచ్చిన రోజులు లేవన్నారు. గౌరెల్లి ప్రాజెక్ట్ నీళ్లు వదిలి రైతులను ఆదుకొని హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఊసకోయిల కిషన్, శ్రీరామోజు శ్రీనివాస్, దొంగల వేణు, అయిత సాయి, బొజ్జపురి పృథ్వి, భైరవోణీ అనిల్, మాడ్గుల అజిత్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.