సిరా న్యూస్,కుత్బుల్లాపూర్;
టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపుతో కుత్బుల్లాపూర్ లోని జగద్గిరిగుట్ట లో గల తెలంగాణ తల్లికి ఎంఎల్ఏ వివేకానంద పాలభిషేకం చేసారు. తెలంగాణ అస్తిత్వం తో పెట్టుకుని నిలబడ్డ నాయకుడు తెలంగాణలో లేడని అన్నారు. తెలంగాణకు మణిహరంగా ఎర్పాటుచేసుకున్న తెలంగాణ సచివాలయానికి డా. బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టుకున్న చరిత్ర టిఆర్ఎస్ పార్టీది. కేసిఆర్ ది. డిల్లీ నాయకుల వద్ద పేరు కొట్టేయడమే లక్ష్యంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన నీచరాజకీయం కాంగ్రెస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. తెలంగాణ లో మళ్లీ కేసిఆర్ సర్కార్ ఎర్పాటు అవ్వడం ఖాయమని,ఈ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.