సిరా న్యూస్,కోరుట్ల;
కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
జువ్వాడి కృష్ణారావు సమక్షంలో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా పన్నాల అంజిరెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అలాగే వైస్ చైర్మన్ పొన్నూరు వెంకటేష్ గౌడ్, డైరెక్టర్లు శ్రీరాములు అమరేందర్, అబ్దుల్ వాసీద్, దోడ బాపురెడ్డి, పల్లెపు రాజు,అల్లాడి శ్రీను, బొల్లె నరసయ్య, పడాల కవిత, లచ్చయ్య,జక్కుల రాజన్న, ఏనుగు బల్వంత్ రెడ్డి, జగన్నాథుని లక్ష్మణ్ లు బాధ్యతలు స్వీకరించారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య -అనిల్, అయిలాపూర్ ఫ్యాక్స్ చైర్మన్ చింతకుంట సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ఉపాధ్యక్షులు నాయిమ్,బిసి సెల్ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు రిజ్వాన్ పాషా తదితరులు ఉన్నారు.