– మూడుకు చేరిన మృతుల సంఖ్య
సిరా న్యూస్,అనకాపల్లి;
పరవాడ సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ యూనిట్-3లో ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 3కు చేరింది. ఇవాళ తెల్లవారుజామున విశాఖలోని ఇండస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ మరణించారు. ఆయన మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఇప్పటికే ఇదే ప్రమాదంలో గాయపడిన ఝార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్ పూరి, రొయా అంగిరియా మృతి చెందారు. అదే రాష్ట్రానికి చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది