సిరాన్యూస్,ఖానాపూర్
డ్రైనేజీ సమస్యను పరిష్కరించిన వార్డ్ కౌన్సిలర్ పరిమి లత సురేష్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఐదో వార్డులోని పద్మావతి నగర్ కాలనీలో వర్షం పడి డ్రైనేజ్ వాటర్ రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయం ప్రజలు ఖానాపూర్ మున్సిపల్ గ్రూపులో సమస్య గురించి పెట్టగానే తక్షణమే వార్డ్ కౌన్సిలర్ పరిమి లత సురేష్ స్పందించారు. ఈ సమస్యను మూడు రోజుల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దాని ప్రకారం బుధవారం తన సొంత డబ్బులతో ఎల్ టి మిషన్ తెప్పించి మున్సిపల్ సిబ్బందితో దగ్గరుండి సమస్యను పరిష్కరించారు. తక్షణము స్పందించి సమస్యను పరిష్కరించినటువంటి వార్డు కౌన్సిలర్ కి కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. ఐదో వార్డులో ఎక్కడ ఏ సమస్య ఉన్న మన వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకువస్తే తక్షణంగా ఆ యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేశారు.