సిరా న్యూస్, బేల:
ప్రజాపాలనకు ఇదే నిదర్శనం…
కాంగ్రేస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారులను గ్రామాలకు పంపించి, ప్రజల వద్ద నుండి నేరుగా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడం ప్రజాపాలనకు నిదర్శనమని పాటన్ సర్పంచ్ పైదుల్లా ఖాన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాటన్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులను అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. గతంలో పథకాల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరిగేవారని, నేడు అ«ధికారులు ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. అనంతరం ఎంపిడీవో మహేందర్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ప్రజాపాలనకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొప్పుల సుహాసిని, జేఎల్‌ఎం శేఖర్, అంగన్‌వాడీ టీచర్ గెడం లక్ష్మీ, ఏఫ్‌ఏ సాయినాథ్, ఆశా వర్కర్ బబిత, తదితరులు పాల్గొన్నారు.